Hyderabad, OCT 06: మునుగోడు ఉపఎన్నికలో (Munugode bypoll) ప్రజాశాంతి పార్టీ (Prajashanthi Party) తరపున ప్రజాగాయకుడు గద్దర్ (Gaddar) పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ప్రకటించారు. పీస్ మీటింగ్ కు పోలీసులు పర్మిషన్ నిరాకరించడాన్ని నిరసిస్తూ ఈ నెల 2న కేఏ పాల్ ఆమరణ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. అయితే నిమ్మరసం ఇచ్చి కేఏ పాల్ తో దీక్ష విరమింపజేశారు కేఏ పాల్. రేపటి నుంచి మునుగోడులో ప్రచారానికి గద్దర్ (Gaddar) వెళ్తారని అన్నారు కేఏ పాల్. ”మునుగోడు ఉపఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరపున గద్దర్ అన్నను అభ్యర్థిగా నిర్ణయించి ప్రకటిస్తున్నాం. ఒకవేళ బీజేపీ (BJP), టీఆర్ఎస్ (TRS), కాంగ్రెస్ (Congress).. గద్దర్ అన్నకు సపోర్ట్ ఇస్తామంటే, ప్రజాశాంతి పార్టీ నుంచి పోటీని విరమించి, ఇండిపెండెంట్ గా నిలబెట్టి, ఎన్నికలు అయ్యే వరకు గద్దర్ అన్నతోనే మునుగోడులో ఉంటాను. రేపటి నుంచి నామినేషన్ వేసే వరకు గద్దర్ అన్నతోనే ఉంటాను. కేసీఆర్ గారు.. మీకు అన్నంటే ఎంతో ప్రేమ, అభిమానం. మరి ఎందుకు కేసులు పెట్టారో తెలీదు. ఆ కేసులు విత్ డ్రా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. టీఆర్ఎస్ తరపున గద్దర్ అన్నకు మీరు మద్దతిస్తామంటే, మీరు నేను కలిసి పోరాడదాం” అని కేఏ పాల్ అన్నారు.
— Dr KA Paul (@KAPaulOfficial) October 5, 2022
ప్రపంచ శాంతి కోసమే తాను కేఏ పాల్ పార్టీలో (KA Paul party) చేరారని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. కేఏ పాల్ దీక్షను విరమింపజేసిన గద్దర్.. రేపట్నుంచి మునుగోడులో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తానన్నారు. తెలంగాణలో చాలా పార్టీలు తనను ఆహ్వానించాయని, అయితే తనకిష్టమైన కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలో తాను చేరానని గద్దర్ చెప్పారు. తన దగ్గర పైసలు లేవని, తాను ఓటుకు పైసలు ఇవ్వనన్న గద్దర్.. అభిమానంతో ఓట్లు వేస్తే ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. దేశంలో, రాష్ట్రంలో శాంతి లోపించిందన్నారు గద్దర్. మా సిద్దాంతం ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలని ఆకాంక్షించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నట్టు గద్దర్ తెలిపారు. ప్రపంచశాంతి కోసం కృషి చేస్తున్న పాల్‌తో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతోనే ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నట్టు చెప్పారు. ప్రజల ఆశీర్వాదం కోసం రేపటి నుంచే ప్రచారం ప్రారంభిస్తానన్నారు.
కాగా, ప్రజాగాయకుడు గద్దర్ ఎన్నికల్లో పోటీ చేయనుండటం ఇదే తొలిసారి. నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్, 6న ఓట్ల లెక్కింపు జరగనుంది. గద్దర్ గతంలో తన కొడుకుతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత నుంచి ఆయన కాంగ్రెస్ తో పాటు అన్ని పార్టీలతో సన్నిహితంగానే ఉన్నారు. తన కొడుకు కోసమే గద్దర్ కాంగ్రెస్ లో చేరారనే వాదనలున్నాయి. ప్రస్తుతం ఆయన ప్రజాశాంతి పార్టీలో చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.