Shankar Rao Convicted:రెండు కేసుల్లో దోషిగా తేలడంతో కోర్టులోనే సృహతప్పిన మాజీమంత్రి శంకర్‌రావు, శిక్ష రద్దు చేసి జరిమానాతో సరిపెట్టిన కోర్టు

Hyderabad January 13: మాజీమంత్రి శంకర్‌రావు(Ex-minister Shankar Rao )ను రెండు కేసుల్లో దోషి(convicted)గా తేల్చింది ప్రజా ప్రతినిధుల కోర్టు. భూ వివాదానికి(Land case) సంబంధించి బెదిరించారన్న ఆరోపణలతో షాద్‌నగర్‌(Shadnagar)లో 2015లో ఓ కేసు నమోదైంది. ఓ మహిళ ఇంట్లోకి అక్రమంగా చొరబడి బెదిరించారని మరో కేసు గతంలో నమోదైంది. ఈ రెండు కేసుల్లో విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధులు కోర్టు(MLA and MP Special Court)ముందుగా ఆయనకి ఆరు నెలలు జైలు శిక్ష(6 months jail term) విధించింది. తరువాత తీర్పుని కొట్టివేసి జరిమానా విధించింది.

తొలుత ఈ రెండు కేసులు విచారించిన కోర్టు ఆయనకు 6 నెలల జైలు శిక్ష విధించడంతో శంకర్‌రావు కోర్టు హాలులోనే స్పృహ తప్పి() పడిపోయారు. దీంతో అక్కడి న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఆయనను లేపి నీళ్లు తాగించడంతో కోలుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పు(MLA and MP Special Court)ను మార్చింది. ఓ కేసులో రూ.2 వేలు, మరో కేసులో రూ.1,500 జరిమానా(penalty) చెల్లించాలని ఆదేశించింది. ఈ రెండు కేసులతో పాటు మరోకేసు కూడా షాద్ నగర్ లో నమోదైంది. అయితే, దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో.. న్యాయస్థానం ఆ కేసుని కొట్టవేసింది.