Warangal, June 11: కదులుతున్న రైలు (Train) నుంచి దిగుతూ ప్రమాదంలో కిందపడ్డ ఓ ప్రయాణికురాలిని ఆర్పీఎఫ్ (RPF) మహిళా కానిస్టేబుల్ (Women Constable) కాపాడారు. పూర్తి వివరాల్లోకి వెళితే, భద్రాచలం (Bhadrachalam) నుంచి సికింద్రాబాద్ (Secunderabad) వెళ్లే మణుగూరు ఎక్స్ ప్రెస్( నెంబర్ 12746) శనివారం తెల్లవారుజామున 2.47 గంటలకు వరంగల్ స్టేషన్‌కు చేరుకుంది. రైలు నెమ్మదిగా ఆగుతున్న సమయంలో ఓ మహిళ కిందకు దిగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పట్టు జారడంతో ఆమె ప్లాట్‌ఫాంపై పడిపోయారు.
హ్యాండిల్‌ను గట్టిగా పట్టుకొని..
భయంతో మహిళ రైలు తలుపు వద్ద ఉన్న హ్యాండిల్‌ను గట్టిగా పట్టుకున్నారు. ఫలితంగా, ఆమెను రైలు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఇది గమనించిన మహిళా కానిస్టేబుల్ సోనాలీ ఎం మొలాకే పరుగున వచ్చి ప్రయాణికురాలికి ఒక్క ఉదుటున ప్లాట్‌ఫాంవైపు లాగి ప్రయాణికురాలిని కాపాడారు. కానిస్టేబుల్ గమనించి ఉండకపోతే ఆమె రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయిన ప్రాణాలు కోల్పోయేది. కాగా, విధుల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన సోనాలీని ఉన్నతాధికారులు అభినందించారు.