KCR Public Meeting at Chevella: కాంగ్రెస్ పార్టీని మీ గ్రామాలలో నిలదీయండి..అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తా..కాంగ్రెస్‌ ప్రభుత్వం కుదేలైంది : నాలుగు నెలల రేవంత్ సర్కారుపై మాజీ సీఎం కేసీఆర్‌ అగ్గి మీద గుగ్గిలం
KCR Speech (photo-Video Grab)

మాజీ సీఎం కేసీఆర్ చేవెళ్ల నుంచి బీఆర్‌ఎస్‌ ఎన్నికల శంఖారావం ప్రారంభించారు. చేవెళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో ప్రధానంగా 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతోనే తెలంగాణ సాధించాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం. నాలుగు నెలలకే కాంగ్రెస్‌ ప్రభుత్వం కుదేలైందని విమర్శించారు.

కేసీఆర్ ప్రసంగంలో హైలైట్స్ ఇవే..

>> దళితులకు 12 లక్షలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీని మీ గ్రామాలలో నిలదీయండి..

>> గత ప్రభుత్వంలో మేము ప్రొసిడింగ్స్ ఇచ్చిన 1 లక్ష 30 వేల దళిత కుటుంబాలకు దళిత బంధు ఇవ్వకుంటే.. నేనే వాళ్ళందరిని తీసుకొని వచ్చి అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తా.

>> చేవెళ్ల సభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

>> మహనీయుడు అంబేద్క‌ర్ పుణ్య‌మా అని.. వారి స్ఫూర్తితో తెలంగాణ సాధించుకున్నాం. అంబేద్కర్ గారికి సమున్న‌త గౌర‌వం ఇవ్వాలనే ఉద్దేశంతో దేశంలోనే ఎక్క‌డ లేనంత 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని నెలకొల్పాం..

>> కొత్త‌గా నిర్మించిన స‌చివాల‌యానికి అంబేద్క‌ర్ పేరు పెట్టుకున్నాం. రేపు అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర స‌మాజం ప‌క్షాన‌, మ‌న ప‌క్షాన వారికి హృద‌య‌పూర్వ‌క‌మైన నివాళుల‌ర్పిస్తున్నాను