గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో నా స్థానంలో ఎవరు గెలుస్తారో తనకు తెలియదని ఆయన అన్నారు. మళ్లీ అసెంబ్లీకి రాలేనని నిరాశ వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తనను అడుగు పెట్టకుండానే తన చుట్టూ రాజకీయం నడుస్తోందన్నారు. స్వంత వ్యక్తులు, బయటి వ్యక్తులు నన్ను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు తన విన్నపం తెలియజేశారు. నేను ఉన్నా లేకపోయినా తన గోషామహల్ నియోజక వర్గ ప్రజలను కరుణించాలని ఆయన ప్రార్థించారు.
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి,
గోషామహల్ నియోజకవర్గాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని రాజా సింగ్ అన్నారు. గోషా మహల్ నియోజకవర్గానికి ఎంతో కృషి చేశానన్నారు. తాను ఎన్నికైనప్పటి నుంచి నియోజకవర్గంలోని సమస్యలు, తన పరిధిలో లేని పనులు, ప్రభుత్వం చేయాల్సిన పనులను అనేక వేదికలపై, అన్ని అసెంబ్లీ సమావేశాల్లో వివరించానని పేర్కొన్నారు.
आने वाली विधानसभा में शायद में नहीं रहूंगा
....मुख्यमंत्री KCR जी से धूलपेट का दौरा करने और लोगों को सहायता प्रदान करने का अनुरोध किया। @TelanganaCMO जी को याद दिलाया कि उन्होंने पहले भी मेरे गोशामहल निर्वाचन क्षेत्र का दौरा करने और जरूरतमंद लोगों की मदद करने का वादा किया था। pic.twitter.com/4D7mXep034
— Raja Singh (@TigerRajaSingh) August 6, 2023
ఇదిలా ఉంటే ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్రమశిక్షణా చర్యల కింద ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన బీజేపీకి దూరంగా ఉన్నారు. కొంత కాలం తర్వాత సస్పెన్షన్ ఎత్తివేస్తారని భావించినా ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి సంకేతాలు లేవు. అయితే, బీఆర్‌ఎస్ కీలక నేత, మంత్రి హరీశ్‌రావుతో రాజా సింగ్ భేటీ కావడం కొత్త ఊహాగానాలకు దారితీసింది. ఆయన పార్టీ మారబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని రాజా సింగ్ కొట్టిపారేశారు.