Hyderabad, June 07: ప్రభుత్వ ఉపాధ్యాయుల (Govt Teachers) బదిలీ, పదోన్నతుల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ నెల 8 నుంచి ఉపాధ్యాయుల బదిలీ (Govt Teachers Transfers), పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది. పదవీ విరమణకు 3 ఏండ్ల లోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. మల్టీ జోన్ 1లో (Zone) శనివారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు, మల్టీ జోన్ 2లో రేపట్నుంచి ఈ నెల 30 వరకు బదిలీలు, పదోన్నతులు చేపట్టనున్నారు.
కోర్టు కేసులతో గతంలో ఎక్కడ ప్రక్రియ ఆగిపోయిందో అక్కడి నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. టెట్‌తో (TET) సంబంధం లేకుండానే ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ జరగనుంది.