Rains (Credits: Pixabay)

Hyderabad, AUG 24: తెలంగాణలో రాగల రెండురోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే (Rain Alert) అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

AP Capital Amaravathi Update: అమ‌రావ‌తి నిర్మాణ ప‌నుల‌పై మంత్రి నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు, ఎంత ఖ‌ర్చ‌వుతుంది? ఎప్ప‌టి నుంచి ప‌నులు ప్రారంభిస్తారంటే? 

ఆదివారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్ వనపర్తి, నారాయణపేటలో పలుచోట్ల గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని వివరించింది.