Hyderabad Traffic Rules: ఇకపై రాంగ్‌ రూట్‌లో వెళ్తే భారీ ఫైన్, రూల్స్‌ను కఠినంగా అమలు చేయనున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, త్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్‌, రాంగ్ రూట్‌ రూ.1700, ట్రిపుల్ రైడింగ్‌ కు రూ. 1200 ఫైన్‌
New RTI Act, Road Safety- representational image.

Hyderabad, NOV 20: బండి తీసుకుని రోడ్డు మీదకు వస్తున్నారా? దగ్గరే కదా.. రాంగ్ రూట్ లో (Wrong Route) వెళ్దాం, ఏమీ కాదులే అని అనుకుంటున్నారా? అర్జంట్ పని ఉంది, ఒకే బండి మీద ముగ్గురం వెళ్దామని ఫిక్స్ అయ్యారా? అయితే, బీ కేర్ ఫుల్. పొరపాటున కానీ ఈ పనులు చేసి దొరికిపోయారో, ఇక అంతే, భారీ మూల్యం (Fine) చెల్లించుకోక తప్పదు. మీ జేబుకి పెద్ద చిల్లు పడటం ఖాయం. ఇకపై రాంగ్ రూట్ లో వెళ్లినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా తాట తీస్తామంటున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. జరిమానాల మోత మోగిస్తామంటున్నారు. రాంగ్ రూట్ లో బండి నడిపితే రూ.1700 ఫైన్ వేయనున్నారు. ట్రిపుల్ రైడింగ్ అయితే రూ.1200 జరిమానా వేస్తారు. ఈ నెల 28 నుంచి ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ (Special Drive) చేపట్టనున్నారు. రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ చేసే వాహనదారులపై కొరడా ఝళిపించనున్నారు.

EVs For AP Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాలు.. 17 సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం.. ఏడాదికి లక్ష వాహనాలు అందించాలని లక్ష్యం.. దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేక యాప్ తీసుకొచ్చిన నెడ్‌క్యాప్ 

ఇప్పటికే జరిమానాలు ఓ రేంజ్‌లో పెంచేసిన ట్రాఫిక్ పోలీసులు.. నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ మళ్లీ కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఇటీవల ఆపరేషన్ రోప్ (Operation Rope) పేరుతో.. వాహనదారులను లైన్‌లో పెట్టేందుకు చర్యలు తీసుకున్న పోలీసులు.. ఇప్పుడు రాంగ్ రూట్‌ లో వెళ్లే వారిపై, ట్రిపుల్ రైడింగ్ చేసే వారిపై ఫోకస్ పెట్టారు. వారిపై భారీగా జరిమానాలు విధించి సరైన రూట్‌లో పంపిచేందుకు సిద్ధమయ్యారు. చాలా వరకు రోడ్డు ప్రమాదాల్లో.. రాంగ్ రూట్‌లో వెళ్లటం, ట్రిపుల్ రైడింగ్ చేయటం వల్ల ఎక్కువగా జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. 2020లో రాంగ్ రూట్‌లో వెళ్లటం వల్ల 15 మంది, ట్రిపుల్ రైడింగ్‌లో 24 మంది చనిపోగా.. 2021లో రాంగ్ రూట్‌లో వెళ్లి 21 మంది, ట్రిపుల్ రైడింగ్‌లో 15 మంది మృత్యువాత పడినట్టు పోలీసులు తెలిపారు. ఇక 2022లో అక్టోబర్ 31 వరకు రాంగ్ రూట్‌లో వెళ్లి 15 మంది.. ట్రిపుల్ రైడింగ్ చేస్తూ 8 మంది చనిపోయినట్టు పోలీసులు తెలిపారు.

Andhra Pradesh: చంద్రబాబు రాకతో సీమకి కరువు రాకూడదు, రాయలసీమ అంతటా పవిత్ర జలాలతో శుద్ధి చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు 

ఈ క్రమంలో రాంగ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ (Triple riding) వల్ల కలిగే అనర్ధాలపై వాహనదారులకు అవగాహన కల్పిస్తామని, వారిలో చైతన్యం తీసుకొస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుందని కొందరు వాహనదారులు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసి తమ ప్రాణాలను ప్రమాదంలో పడేసుకుంటున్నారని పోలీసులు వాపోయారు. వారు తమ ప్రాణాలను రిస్క్ లో పడేయటమే కాకుండా ఎదుటివారి ప్రాణాలను కూడా రిస్క్ లో పడేస్తున్నారని పోలీసులు చెప్పారు.