Vijaya Reddy joins Congress: గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్, పార్టీని వీడనున్న పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి, త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతానని ప్రకటన, రేవంత్ రెడ్డితో కలిసి ప్రెస్ మీట్
గ్రేటర్ హైదరాబాద్ లో గులాబీ పార్టీకి (TRS) బిగ్ షాక్. టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయా రెడ్డి (Vijaya reddy) కాంగ్రెస్ లో చేరనున్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ నెల 23న కాంగ్రెస్ లో (Joining in Congress) చేరుతున్నట్లు విజయారెడ్డి ప్రకటించారు. మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డిని (Revanth Reddy) కలిశానని తెలిపారు.
Hyderabad, June 18: గ్రేటర్ హైదరాబాద్ లో గులాబీ పార్టీకి (TRS) బిగ్ షాక్. టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయా రెడ్డి (Vijaya reddy) కాంగ్రెస్ లో చేరనున్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ నెల 23న కాంగ్రెస్ లో (Joining in Congress) చేరుతున్నట్లు విజయారెడ్డి ప్రకటించారు. మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డిని (Revanth Reddy) కలిశానని తెలిపారు. దేశంలో కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయం అన్నారు. తన నాన్న పీజేఆర్ సీఎల్పీ లీడర్ గా పార్టీలో ఉండి..పార్టీలోనే మరణించారని గుర్తు చేశారు. తన కుటుంబం ముందు నుండి కాంగ్రెస్ లోనే ఉందని చెప్పారు. పీజేఆర్ కూతురుగా (PJR Daughter) టీఆర్ఎస్ లో ఇమడలేకపోయానని పేర్కొన్నారు. అందరితో చర్చించిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తాను పీజేఆర్ బాటలోనే నడుస్తానని చెప్పారు.
కాంగ్రెస్ లో ఉంటేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. దేశానికి ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ కాదు..కాంగ్రెస్ వైపు అందరూ చూస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని కొనియాడారు. తన వంతు కృషి కాంగ్రెస్ పార్టీకి చేస్తానని చెప్పారు.
పీజేఆర్ కూతురు విజయా రెడ్డి.. గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ (TRS)ముఖ్యమైన లీడర్ గా ఉన్నారు. అంతేకాకుండా గ్రేటర్ లో మేయర్ పదవికి ఆమె పోటీ పడిన విషయం కూడా తెలిసిందే. ప్రస్తుతం ఖైరాతాబాడ్ కార్పొరేటర్ గా విజయా రెడ్డి ఉన్నారు.
(The above story first appeared on LatestLY on Jun 18, 2022 11:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

