Hyderabad, Sep 23: హైదరాబాద్ (Hyderabad) పరిసరాలలో అక్రమ కట్టడాలను (Hydra Demolitions) కూలుస్తూ ఆక్రమణదారుల గుండెలలో దడ పుట్టిస్తోన్న హైడ్రా మరింత దూకుడు పెంచింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. కావూరి హిల్స్ పార్కు స్థలంలో వెలసిన అక్రమ షెడ్లను హైడ్రా సిబ్బంది కూలుస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Here's Videos:
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు.
కావూరి హిల్స్ పార్కు స్థలంలో వెలసిన అక్రమ షెడ్లను కూలుస్తున్న హైడ్రా సిబ్బంది... pic.twitter.com/Sl9J4QNnHf
— ChotaNews (@ChotaNewsTelugu) September 23, 2024
పటేల్ గూడ, కిష్టారెడ్డిపేటలో అర్దరాత్రి వరకు కొనసాగిన హైడ్రా కూల్చివేతలు
నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల అపార్ట్ మెంట్, ఆరు అంతస్తుల బిల్డింగ్ నేలమట్టం చేసిన హైడ్రా
నాలుగు భారీ ఎస్కవేటర్లతో పటేల్ గూడలో 20 ఇళ్ళకు పైగా పడగొట్టిన హైడ్రా https://t.co/rrHktEnyJb pic.twitter.com/usAl6RpTjd
— Telugu Scribe (@TeluguScribe) September 23, 2024
హైడ్రా రికార్డ్
ఆదివారం అమీన్ పూర్ లో అక్రమ నిర్మాణాలపై బిగ్ ఆపరేషన్ ను పూర్తి చేసిన హైడ్రా కొత్త రికార్డ్ సృష్టించింది. నాన్ స్టాప్ గా 17 గంటల పాటు కూల్చివేతలు చేపట్టింది. రాత్రి ఒంటి గంట వరకు కూల్చివేతలు కొనసాగాయి. పటేల్ గూడలో 16 విల్లాలను కూల్చి వేశారు. ఒక హాస్పిటల్, 2 అపార్ట్ మెంట్లను కూడా అధికారులు కూల్చివేశారు. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన తర్వాత పగలు, రాత్రి ఆపరేషన్ ను నిర్వహించడం ఇదే తొలిసారి.