
Hyderabad, NOV 16: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మరోసారి ఆదాయపన్నుశాఖ అధికారుల సోదాలు ముమ్మరమయ్యాయి(IT RAIDS). 40 బృందాలతో హైదరాబాద్‌తో పాటు నల్గొండ, మిర్యాలగూడలో (Miryalaguda)ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు ఇంట్లో వేకువజామున 4 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి.
భాస్కరరావుకు (Baskar Rao) దేశవ్యాప్తంగా పలు వ్యాపారాలున్నాయి. ఒక్క నల్గొండలోనే 30 బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి.