CM KCR (Photo-ANI)

చండీగఢ్ : ఉత్తరాది రాష్ట్రాల పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఇవాళ చండీగఢ్ వెళ్లనున్నారు. ప్రధాని మోడీ తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ చేసిన ఆందోళనలో మరణించిన రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శించున్నారు. ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులతో కలిసి వారికి ఆర్థిక సాయం అందించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసానికి వెళ్తారు.

Telangana Police Recruitment: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్‌ గుడ్ న్యూస్, పోలీసుశాఖ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితి మరో రెండేళ్లు పొడిగింపు 

అక్కడ  మధ్యాహ్న భోజనం తర్వాత ఇరువురు నేతలు చండీగఢ్‌ పయనమవుతారు. రైతు ఉద్యమంలో ప్రాణాలర్పించిన సుమారు 6 వందల రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శిస్తారు. వారికి ఆర్థికసాయంగా ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేస్తారు.