Hyderabad, DEC 24: ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు (6 Guarantees) పొందాలంటే అర్హత ఏంటన్న విషయంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) వివరాలు తెలిపారు. తాము అమలు చేసే 6 గ్యారంటీలకు తెల్లరేషన్ కార్డే అర్హతని చెప్పారు. ఆయా పథకాలకు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామసభల ద్వారా స్వీకరిస్తామని తెలిపారు. పథకాల అమలుపై ఇవాళ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి పొంగులేటి మీడియాకు వివరాలు తెలిపారు.
ప్రభుత్వ 6 గ్యారంటీలకు సంబంధించి ముందుగా ప్రజలకు దరఖాస్తులు ఇవ్వనున్నట్లు చెప్పారు. గ్రామసభల్లో అధికారులకు దరఖాస్తులు అందజేసి, రసీదు తీసుకోవాలని వివరించారు. దరఖాస్తులను పరిశీలించి ఎవరు ఏ పథకానికి అర్హులో నిర్ణయిస్తారని చెప్పారు. 28 నుంచి నిర్వహించనున్న గ్రామసభలకు నిధులను రేవంత్ రెడ్డి విడుదల చేశారని తెలిపారు.
TSRTC MD Sajjanar: ఆ బస్సు ప్రమాదం జరగడానికి కారణం అసలు కారణం అదే! వివరణ ఇచ్చిన సజ్జనార్
తాము ఆరు గ్యారంటీలలో రెండింటిని అమలు చేస్తున్నామని, మిగతా నాలుగు త్వరలోనే అమలు చేస్తామన్నారు. గత బీఆర్ఎస్ సర్కారులాగా పథకాల్లో కోతలు వంటివి పెట్టబోమని స్పష్టం చేశారు.