Hyd, March 12: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ సభ్యులే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిప్యూటీ స్పీకర్ పద్మారావుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాలు సమయంలో రసమయి తన వంతు వచ్చినప్పుడు ప్రసంగిస్తున్నారు. అయితే ప్రసంగం కాకుండా ప్రశ్న అడగాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు అన్నారు. తాను ప్రశ్నే అడుగుతున్నానని ప్రసంగం కాదని రసమయి బాలకిషన్ బదులిచ్చారు.
ప్రశ్నోత్తరాల సమయంలో.... అయినా డిప్యూటీ స్పీకర్ వారించడంతో రసమయి బాలకిషన్ అసహనం వ్యక్తం చేశారు. తమకు మాట్లాడే అవకాశమివ్వరని, కనీసం మంత్రులను ప్రశ్నలు అడిగేందుకు కూడా సమయం ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు. మాట్లాడ వద్దంటే మాట్లాడనంటూ రసమయి తన సీట్లో కూర్చున్నారు. దీంతో డిప్యూటీ స్పీకర్ క్లుప్తంగా మాట్లాడి ముగించండి అంటూ చెప్పడంతో రసమయి తన ప్రశ్నను అడిగి ముగించారు.