
Siddipet, July 11: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బాడీ బిల్డర్, మిస్టర్ తెలంగాణ విజేత మహ్మద్ సోహైల్ (23) (Mohd Sohail Died) ప్రాణాలు కోల్పోయాడు. మహ్మద్ సోహైల్ అతని స్నేహితుడు మహ్మద్ ఖదీర్‌తో కలిసి జూన్ 29వ తేదీన సిద్దిపేట నుంచి మిరిదొడ్డి వైపునకు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బైక్‌పై వేగంగా వెళ్తుండగా అదుపుతప్పి స్క్రాప్ ఆటోను ఢీకొట్టాడు. ఈ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన అతను.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు (Mohd Sohail Dies).
సిద్దిపేట జిల్లాకు చెందిన సోహైల్ (Mohd Sohail) అనేక జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, దక్షిణ భారత స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నాడు. మిస్టర్ తెలంగాణ ఛాంపియన్‌షిప్‌లోనూ విజేతగా నిలిచాడు. బాడీ బిల్డింగ్‌లో గొప్ప భవిష్యత్తు ఉన్న సోహైల్.. ఇంత చిన్నవయసులోనే మరణించడం పట్ల అతని కుటుంబసభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.