మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో నాలుగు రౌండ్లు ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. నాలుగో రౌండ్ ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ 714 ఓట్ల మెజార్టీలో ఉంది. ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీకి 26443 ఓట్లు పడగా బిజెపికి 25729 ఓట్లు, కాంగ్రెస్ కు 7380, ఇతరులకు ఐదు వేలకు పైగా ఓట్లు పడ్డాయి.
మునుగోడ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా చౌటుప్పల్ మండలంలో తాము అనుకున్నంత మెజార్టీ రాలేదని బిజెపి అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకైతే టిఆర్ఎస్ ఆధిక్యంలో ఉందని, రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారుతున్నాయని వివరించారు. చివరి వరకు హోరాహోరి పోరు తప్పక పోవచ్చన్నారు. బిజెపి గెలుస్తుందనే నమ్మకం మాత్రం ఉందని చెప్పారు.