Music director Keeravani is providing music for Telangana state anthem Jaya Jaya He Telangana Telangana

ప్రముఖ కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతానికి కొన్ని మార్పులు చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివిలో ఈ గీతం సిద్ధం అవుతోంది. సినీ సంగీత దర్శకుడు కీరవాణితో ఈ పాటను రేవంత్ ప్రభుత్వం కంపోజింగ్ చేయించింది. కాగా తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన అందెశ్రీకి కొన్ని మార్పులు చేయాలని ప్రభుత్వం సూచించింది. అందులో భాగంగా అందెశ్రీ ఈ గీతంలో మార్పులు చేసి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం అమోదముద్ర వేసింది. ఆ గీతాన్ని సినీ సంగీత దర్శకుడు కీరవాణితో కంపోజింగ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌, తెలంగాణ కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలు ఇవిగో..

జూన్ 2వ తేదీ ఈ గీతాన్ని ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీతో విడుదల చేయించేదుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాసేపటి క్రితమే అందెశ్రీ, కీరవాణి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి తెలంగాణ గీతాన్ని వినిపించారు. ఈ గీతం చాలాబాగుందని రేవంత్ కితాబిచ్చారు. అయిదారు చరణాలతో పూర్తి గీతం ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి రెండు చరణాలను మాత్రమే రాష్ట్రం గీతంగా ప్రకటించారు.

Here's Update

ఈ రెండు చరణాల్లో తెలంగాణ అవిర్భావం ఎలా జరిగింది, రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుకొచ్చేలా రాష్ట్ర గీతం ఉండనున్నది. జూన్2న రాష్ట్ర ప్రజలకు అంకితం చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక సమావేశాల సమయాల్లో తెలంగాణ గీతాన్ని ఆలపించే అవకాశం ఉంది