Hyderabad, JAN 01: డీజీపీ, హైదరాబాద్ సీపీకి జాతీయ మానవహక్కుల కమిషన్ నోటీసులు (NHRC Notice) జారీ చేసింది. సంధ్య థియేటర్ (Sandhya Theatre Stampede) ఘటనపై వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. సీనియర్ ర్యాంక్ పోలీస్ అధికారితో విచారణ జరపాలని ఆదేశించింది. ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని చెప్పింది. సంధ్య థియేటర్ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి (NHRC) రామారావు అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. పుష్ప-2 ప్రీమియర్ షో (Pushpa 2) సందర్భంగా లాఠీఛార్జి చేశారని ఆరోపించారు. లాఠీఛార్జి వల్లే రేవతి చనిపోయిందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ న్యాయవాది రామారావు పేర్కొన్నారు.
డిసెంబర్ 4న తేదీన ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఉన్న సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట (Sandhya Theatre Stampede) జరిగింది.
NHRC Issues Notice To Telangana DGP
బిగ్ బ్రేకింగ్..
అల్లు అర్జున్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్.
కీలక ఆదేశాలు జారీ చేసిన NHRC కమిషన్.
సంధ్య థియేటర్ దగ్గర లాఠీ ఛార్జ్ చేసిన పోలీసుల పై చర్యలకు ఆదేశం.
లాయర్ రామారావు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ
నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని డీజీపీ జితేందర్ కు…
— greatandhra (@greatandhranews) January 1, 2025
పుష్ప-2 విడుదల సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్‌లో బెనిఫిట్ షో చూసేందుకు వెళ్లారు. ఆయనను చూసేందుకు ఫ్యాన్స్ పెద్దఎత్తున రావడంతో వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. అదే సమయంలో తొక్కిసలాట జరగడంతో రేవతి అనే మహిళ మృత్యువాత పడింది. ఆమె కుమారుడు సైతం తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం అతను కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కోలుకుంటున్నాడు.