PM Modi (Photo-X)

Newdelhi, Nov 11: ప్రధాని మోదీ (PM Modi) మరోసారి హైదరాబాద్‌ కు వస్తున్నారు. శనివారం సాయంత్రం సికింద్రాబాద్‌ లోని పరేడ్‌ గ్రౌండ్స్‌ లో (Parade grounds) నిర్వహిస్తున్న అణగారిన వర్గాల విశ్వరూప బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు పరేడ్‌ గ్రౌండ్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. టివోలి క్రాస్‌ రోడ్స్‌ నుంచి ప్లాజ్‌ ఎక్స్‌ రోడ్స్‌ ను మూసివేయనున్నారు. పలు మార్గాల్లో దారిమళ్లింపులు ఉంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

Restrictions On Firecrackers: హైదరాబాద్‌ లో బాణాసంచా కాల్చడంపై ఆంక్షలు, ఈ టైంలో మాత్రమే కాల్చాలంటూ ప్రజలకు సూచించిన హైదరాబాద్ పోలీసులు, భారీ శబ్ధం వచ్చే క్రాకర్స్‌ కాల్చేవారికి సూచనలు

ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా..

  • సంగీత్‌ ఎక్స్‌ రోడ్స్‌ నుంచి బేగంపేట వైపు వెళ్లే వాహనాలను వైఎంసీఏ నుంచి క్లాక్‌ టవర్‌, ప్యాట్నీ ప్యారడైజ్‌, సీటీఓ, రసూల్‌పుర నుంచి బేగంపేటకు వెళ్లాలి.
  • బేగంపేట నుంచి సంగీత్‌ ఎక్స్‌ రోడ్స్‌ వైపు వెళ్లే వాహనదారులు సీటీఓ ఎక్స్‌ రోడ్స్‌ వద్ద బాలమ్‌ రాయ్‌, బ్రూక్‌ బాండ్‌, తివోలి, స్వీకార్‌ ఉపకార్‌, వైఎంసీఏ, సెయింట్‌ జాన్సన్‌ రోటరీ మీదుగా వెళ్లాలి.
  • బోయిన్‌పల్లి, తాడ్‌ బన్‌ నుంచి టివోలి వైపు వెళ్లే వాహనాలను బ్రూక్‌ బాండ్‌ వద్ద నుంచి సీటీఓ, రాణిగంజ్‌ వైపు మళ్లిస్తారు,
  • కార్ఖానా, జేబీఎస్‌ నుంచి ఎస్‌బీఐ ప్యాట్నీ వైపు స్వీకార్‌ ఉపకార్‌ నుంచి వైఎంసీఏ, క్లాక్‌ టవర్‌ మీదుగా వెళ్లాలి.
  • ప్యాట్నీ నుంచి ఎస్‌బీఐ‌, స్వీకార్‌ ఉపకార్‌ వైపు వాహనాలను అనుమతించరు. క్లాక్‌ టవర్స్‌ వద్ద నుంచి వైఎంసీఏ వైపు మళ్లిస్తారు.
  • తిరుమలగిరి ఆర్టీఏ, కార్ఖానా, మల్కాజిగిరి, సఫిల్‌గూడ నుంచి ఫ్లాజా వైపు వెళ్లే వాహనాలను తివోలి వద్ద నుంచి స్వీకార్‌ ఉపకార్‌, వైఎంసీఏ వైపు మళ్లిస్తారు.

Diwali 2023: దీపావళి సెలవు తేదీ మార్పుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన, హాలిడేను ఆదివారం నుంచి సోమవారానికి మార్చుతున్నట్లు ఉత్తర్వులు