'మటన్ కీమా రోటీ' తిని ఓ వ్యక్తి అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్‌లోని ప్రముఖ ఆల్ఫా హోటల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. 'మటన్ కీమా రోటీ' తిన్న వెంటనే కస్టమర్ అస్వస్థతకు గురికావడంతో సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. లోయర్ ట్యాంక్ బండ్‌లో నివాసం ఉంటున్న మహ్మద్ జమాలుద్దీన్ (40) అనే వ్యక్తి ఈ విషయమై మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం, శుక్రవారం ఉదయం జమాలుద్దీన్ తన స్నేహితులు మెహమూద్, ప్రవీణ్, ఖలీల్, ఉస్మాన్ ఖాన్‌లతో కలిసి ఆల్ఫా హోటల్లో 'మటన్ కీమా రోటీ' తినాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. వీరంతా కలిసి మటన్ ఖీమా రోటీ తిన్నారు.
Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి,
ఉదయం స్నేహితులంతా కలిసి తిన్న 'మటన్ కీమా రోటీ' దురదృష్టకర మలుపు తిరిగింది. వీరు భోజనాన్ని ఆస్వాదిస్తున్న సమయంలో జమాలుద్దీన్ స్నేహితుడు మెహమూద్ ఒక్కసారిగా అస్వస్థత గురై వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు. తన స్నేహితుడి క్షేమం గురించి ఆందోళన చెందిన జమాలుద్దీన్ రెస్టారెంట్ మేనేజర్ భుజంగ్ శివాజీ అనే వ్యక్తిని నిలదీశాడు.
ఆల్ఫా హోటల్లో మటన్ కీమా, రోటీ తిన్న తరువాత యువకులకు అస్వస్థత.. హోటల్ సీజ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు pic.twitter.com/71B9EWQFQg
— Telugu Scribe (@TeluguScribe) September 17, 2023
ఈ ఆందోళన కలిగించే సంఘటనపై జమాలుద్దీన్ మరిన్ని వివరాలు తెలిపారు. వారి స్నేహితులు మటన్ ఖీమా రోటీ నుండి చెడు వాసనను గమనించారు. పరిస్థితిని చూసి కలత చెందిన జమాలుద్దీన్ ఆల్ఫా హోటల్ యాజమాన్యంపై ఫిర్యాదు చేశాడు, చట్ట ప్రకారం తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అనంతరం మార్కెట్ పోలీసులు ఆల్ఫా హోటల్ యాజమాన్యంపై ఐపీసీ సెక్షన్ 273, 336 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. ఇదిలా ఉంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్ సీజ్ చేశారు.