మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా రూ.13,700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.1932 కోట్ల వ్యయంతో కృష్ణపట్నం-హైదరాబాద్ మల్టీ ప్రోడక్ట్ పైప్‌లైన్. వరంగల్-ఖమ్మం-విజయవాడ హైవే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, నా కుటుంబ సభ్యుల్లారా అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. దేశంలో పండగల సీజన్ నడుస్తోంది. పార్లమెంట్‌లో నారీశక్తి బిల్లును ఆమోదించుకున్నాం. తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. రవాణా సదుపాయాలు మెరుగవుతాయని మోడీ అన్నారు. రోడ్డు ప్రాజెక్టుల ద్వారా ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రవాణా సదుపాయాలు మెరుగవుతాయని మోడీ పేర్కొన్నారు.
In Mahabubnagar, launching initiatives and laying the foundation stones for projects that will significantly improve Telangana's infrastructure and connectivity. https://t.co/mz4vP5EXne
— Narendra Modi (@narendramodi) October 1, 2023
పసుపు బోర్డుపై ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. తెలంగాణకు పసుపు బోర్డు. పసుపు రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని పాలమూరు సభ సాక్షిగా ప్రకటించిన ప్రధాని మోదీ ప్రకటించారు. అంతేకాదు ములుగు జిల్లాకు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ప్రకటించారు. దీంతో పాటు సమ్మక్క సారక్క పేరుతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి నామకరణం చేశారు.
People of Telangana welcome the setting up of National Turmeric Board by the @narendramodi Ji Government which will transform the lives of Turmeric Farmers of Telangana.#Modi4Telangana pic.twitter.com/3xEvbY8i12
— BJP Telangana (@BJP4Telangana) October 1, 2023