Tobacco Products (Photo Credits: Youtube/Screengrab)

Hyderabad, May 26: గుట్కా,పాన్ మ‌సాలాల‌పై (𝐆𝐮𝐭𝐤𝐡𝐚  𝐏𝐚𝐧𝐦𝐚𝐬𝐚𝐥𝐚) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది తెలంగాణ ప్ర‌భుత్వం. గుట్కా, పాన్ మసాల తయారీ, అమ్మకాలపై   తెలంగాణ ప్ర‌భు.త్వం విధించింది. ఈ మేరకు తెలంగాణ‌ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పొగాకుతో పాటూ నికోటిన్ (tobacco and nicotine) ఉత్ప‌త్తుల‌ను అమ్మ‌డంతో పాటూ స్టోర్ చేయ‌డం కూడా నేరంగా పరిగ‌ణించ‌నున్నారు. మే 24, 2024 సంవ‌త్స‌రం నుంచి ఏడాది పాటూ నిషేదం అమ‌ల్లో ఉంటుంది.

 

దీనికి సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను అన్ని పోలీస్ క‌మిష‌న‌రేట్లతో పాటూ ఆర్టీసీ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారుల‌కు పంపించారు. ఆర్టీసీ బ‌స్సులు, ట్రైన్ల‌లో పాన్ మ‌సాలాలు, గుట్కాల‌ను ర‌వాణా చేయ‌డంపై కూడా నిషేదం ఉంటుంది. దీనిపై అధికార యంత్రాంగాన్ని అప్ర‌మ‌త్తం చేశారు. ఇప్ప‌టికే త‌మిళ‌నాడులో గుట్కాలు, పాన్ మ‌సాలాల‌పై నిషేదం ఉంది.