Rahul Gandhi In Thukkuguda Meeting: బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తోంది..తెలంగాణలో బీజేపీ బీ టీమ్‌ని ఓడించాం.. ఇప్పుడు దేశంలో బీజేపీని కూడా ఓడించబోతున్నాం..తుక్కు గూడ సభలో రాహుల్ గాంధీ
rahul gandhi, revanth reddy

తుక్కుగూడలో కాంగ్రెస్‌ 'జన జాతర' బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోని విడుదల  చేసింది. రాహుల్‌ గాంధీ.. 'న్యాయపత్రం' పేరుతో జాతీయ స్థాయి కాంగ్రెస్‌ మేనిఫెస్టో  5 గ్యారెంటీల పత్రాన్ని విడుదల చేశారు. అనంతరం రాహుల్ గాంధీ ప్రసంగించారు. తెలంగాణలో బీజేపీ బీ టీమ్‌ని ఓడించాం.. ఇప్పుడు దేశంలో బీజేపీని కూడా ఓడించబోతున్నాం.. బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తోంది.. బీజేపీ దగ్గర డబ్బుంది.. మీ దగ్గర మీ ప్రేమ మాత్రమే ఉందని ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు సరైన న్యాయం చేశామని.. ఈ మేనిఫెస్టో దేశ ముఖచిత్రాన్ని మార్చబోతోంది.. ఇది మా మేనిఫెస్టో కాదు.. దేశ ప్రజల ఆత్మ.. తెలంగాణలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నాం.. దేశవ్యాప్తంగా కూడా హామీలను నిలబెట్టుకుంటాం.. మీకు, నాకు మధ్య ఉన్నది రాజకీయ బంధం కాదు.. ఆత్మీయ బంధం, కుటుంబం బంధం అని రాహుల్‌ గాంధీ ఈ సందర్భంగా మాట్లాడారు.