Rains (Photo-Twitter)

Hyderabad, FEB 23: గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు (Weather Alert) పెరిగిపోతున్నాయి. ఫిబ్రవరి దాటకముందే భానుడి భగభగలు పెరిగిపోయాయి. ఎండవేడిమితో (Summer) ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ (IMD) చల్లని కబురు చెప్పింది. ఈనెలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఫిబ్రవరి 24 నుంచి 26 తేదీల్లో తెలంగాణలోని (Telangana Weather) జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. తేలికపాటి వర్షాలు మాత్రమే కురుస్తాయని… ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాత మళ్లీ పొడి వాతావరణమే ఉంటుందని పేర్కొంది. ఏపీకి వర్ష సూచన (AP Rain Alert) ఇచ్చింది అమరావతి వాతావరణ కేంద్రం. ఉత్తర కోస్తా ప్రాంతంలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతంలో కూడా రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల పొడి వాతావరణమే ఉంటుందని తెలిపింది.

 

తెలంగాణ‌లోని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, మ‌హ‌బూబాబాద్, ములుగు, వ‌రంగ‌ల్, ఖ‌మ్మం జిల్లాల్లో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని ఐఎండీ తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం కురిసే ఛాన్స్ ఉంది. శ‌నివారం నుంచి సోమ‌వారం వ‌రకు ఇదే ప‌రిస్థితి కొన‌సాగే అవ‌కాశ‌ముంది.