Accident in Mahabubnagar (Credits: X)

Mahabubnagar, Jan 11: మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్ (Mahabubnagar) జిల్లా జ‌డ్చ‌ర్ల‌లో శుక్ర‌వారం అర్ధ‌రాత్రి ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జ‌రిగింది. హైద‌రాబాద్ నుంచి అరుణాచలం వెళ్తున్న ఓ ట్రావెల్స్ బ‌స్సు భూరెడ్డిప‌ల్లి వ‌ద్ద లారీని ఢీకొట్టింది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 15 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

పల్లెకు బయల్దేరిన పట్నం.. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ.. సొంతూళ్లకు హైదరాబాద్‌ వాసుల పయనం... టోల్‌ గేట్ల వద్ద రద్దీ (వీడియో)

కారణం ఇదే..

రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు టైర్ బరస్ట్ కావడంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో ముందున్న కారు సడంగా ఆగిపోవడంతో వెనక వస్తున్న లారీ డ్రైవర్ అప్ర‌మ‌త్త‌మై ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో ఆ వెనకాల వస్తున్న బస్సు లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం జరిగిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది.

గుండెపోటుతో 8 ఏళ్ల బాలిక మృతి.. గుజరాత్ అహ్మదాబాద్ లో ఘటన (వీడియో)