Sangareddy MLA Jagga Reddy Resignation: పదిహేను రోజుల తర్వాత రాజీనామాపై నిర్ణయం తీసుకుంటా: ఎమ్మెల్యే జగ్గారెడ్డి  
జగ్గారెడ్డి (File : Pic)

హైదరాబాద్, ఫిబ్రవరి 20: పదిహేను రోజుల తర్వాత రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పెద్దలు తనతో సంప్రదింపులు జరిపిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. సీనియర్ల సలహా మేరకు రాజీనామా నిర్ణయాన్ని పదిహేను రోజులు వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. పార్టీ ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్, వేణుగోపాల్ వద్ద తన సమస్యలు తీరవని జగ్గారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ సభ్యత్వ నమోదు ఇన్ ఛార్జి వేణుగోపాల్ పై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. పదిహేను రోజులు.... జగ్గారెడ్డి పోతే కాంగ్రెస్ కు దరిద్రం పోతుందని ఆయన ఎలా వ్యాఖ్యానిస్తారని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

Corona in AP: ఏపీలో కేసులు భారీగా తగ్గుముఖం, గత 24 గంటల్లో 425 మందికి కరోనా, అన్ని జిల్లాల్లో 100కి లోపే కొత్త కేసులు

సోనియా, రాహుల్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నానని తెలిపారు. వారి అపాయింట్ మెంట్ ఇస్తే తన ఆవేదనను చెప్పుకుంటానని జగ్గారెడ్డి చెప్పారు. సమస్య పరిష్కారం అవుతుందని తాను ఆశిస్తున్నానని జగ్గారెడ్డి చెప్పారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నానన్నారు. సీనియర్ల సలహా మేరకు ఈ పదిహేను రోజులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోనని చెప్పారు.