Patancheru, April 04: సంగారెడ్డి జిల్లా చందాపూర్ శివారులోని ఎస్‌బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమలో (SB Organics) జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు (Death Toll) చేరింది. బుధవారం సాయంత్రం పరిశ్రమలోని ఆయిల్ బాయిలర్ పేలడంతో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. పేలుడు ధాటికి భవనాలు (SB Organics Blast) ధ్వంసమయ్యాయి. దీంతో పరిశ్రమ డైరెక్టర్ రవితోపాటు కార్మికులు నలుగురు దుర్మరణం చెందారు. తాజాగా మరో కార్మికుడు మృతిచెందాడు. శిథిలాల కింద మరో కార్మికుడిని పోలీసులు గుర్తించారు. మృతుడిని హత్నూర మండలం కొన్యాలకు చెందిన వడ్డె రమేశ్‌గా గుర్తించారు. ఘటనా స్థలంలో శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారని గాలిస్తున్నారు. కాగా, మృతదేహాలకు సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానాలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
బుధవారం సాయంత్ర జరిగిన ఘోర ప్రమాదంలో (SB Organics Blast) 30 మంది గాయపడ్డారు. ఘటన జరిగినప్పినప్పుడు పరిశ్రమలో దాదాపు 60 మంది ఉండగా, దాదాపు 15 మంది కార్మికులు బాయిలర్ వద్దే పనిచేస్తున్నట్టు తెలిసింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. ఎస్‌బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమ లో బాయిలర్ పేలిన శబ్దం పది కిలోమీటర్ల మేర వినిపించింది. దట్టమైన పొగలు, మం టలు వ్యాపించాయి. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమీపంలోని పలు పరిశ్రమల్లో కూడా ఆస్తినష్టం సంభవించింది.