మాదాపుర్ SI రంజిత్ కుమార్, రైటర్ విక్రమ్‌ల లీలలు బయటపడ్డాయి. అడిగిన డబ్బులు ఇవ్వకపోతే కూతురు, అల్లుడి మీద కేసు పెడతామని ఓ అమాయకున్ని బెదిరించిన కేసులో ఖాకీల పాపం పండి చివరికి ఈ రోజు ఏసీబీ వలకు చిక్కారు. ఈ అవినీతి ఖాకీలను ఏసీబీ అధికారులు రిమాండ్‌కు తరలించారు. శనివారం మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ దాడులు నిర్వహించింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఈ స్టేషన్ లో జరిగిన దాడుల్లో రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై రంజిత్, రైటర్ విక్రమ్ ఏసీబీ పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వీరిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ పోలీసులు లంచం వ్యవహారంపై విచారిస్తున్నారు. మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది అవినీతి వ్యవహారంపై రెండు రోజులుగా ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. ఇందులో భాగంగా ఎస్సై, రైటర్ అవినీతి వ్యవహారం బయటపడింది.
పైసలిస్తవా.. కేసు రాయన్నా?
👉మాదాపుర్ SI రంజిత్ కుమార్, రైటర్ విక్రమ్‌ల లీలలు.. అడిగిన డబ్బులు ఇవ్వకపోతే నీ కూతురు, అల్లుడి మీద కేసు పెడతామని అమాయకున్ని బెదిరించిన ఖాకీలు.. పాపం పండి చివరికి ఈ రోజు ఏసీబీ వలకు ఈ దుష్ట ఖాకీలు చిక్కారు. వారిని ఏసీబీ అధికారులు రిమాండ్‌కు తరలించారు… pic.twitter.com/E8NaDQNBYh
— ChotaNews (@ChotaNewsTelugu) April 6, 2024