Warangal, DEC 30: వరంగల్ జిల్లా కేంద్రంలో కరోనా (Covid-19) కలకలం సృష్టిస్తున్నది. వరంగల్ ఎంజీఎంలో (Warangal MGMH) ఆరుగురు చిన్నారులకు కరోనా నిర్ధారణ (Corona Positive) అయ్యింది. దీంతో ఎంజీఎంలోని పిల్లల వార్డులో 20 పడకలతో ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేశారు. ఆయా చిన్నారులకు ప్రత్యేక వార్డులో చికిత్స అందజేస్తున్నారు. నగరానికి చెందిన ఆరుగురు చిన్నారులకు కొవిడ్ లక్షణాలు కనిపించాయి. దీంతో కాకతీయ మెడికల్ కాలేజీలోని వైరాలజీ ఆర్టీపీసీఆర్ (RTPCR) పరీక్షలు నిర్వహించగా.. చిన్నారులకు కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం.
ఇటీవల నీలోఫర్ ఆసుపత్రిలో ముగ్గురు చిన్నారులకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అయితే, కరోనా మహమ్మారి మళ్లీ కలవరానికి గురి చేస్తున్నది. ఇటీవల రాష్ట్రంలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. అయితే, ఇందులో చిన్నారులు సైతం ఉండడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నాయి.