Shadnagar, June 25: రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్‌లో (Shad Nagar) పెను విషాదం చోటు చేసుకుంది. స్థానిక సౌత్ గ్లాసు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కంప్రెషర్ పేలడంతో (Compressor Blast) ఆరుగురు మృతి చెందారు. ఈ పేలుడుతో పరిశ్రమ వద్ద భీతావహ వాతావరణం నెలకొంది. గాజు పరిశ్రమ కావడంతో కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ఈ ఘటనలో 15మందికి మందికి గాయాలు కాగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.
Six persons were reportedly killed and at least 15 others were injured in an #explosion in Compressor in the furnace section of South Glass Pvt Ltd factory in the industrial area at #Shadnagar, outskirts of #Hyderabad today.
The injured were shifted to a nearby hospital.#Blast pic.twitter.com/RHPUnWzgy4
— Surya Reddy (@jsuryareddy) June 28, 2024
ఒకేసారి కంప్రెషర్ పేలడంతో (explosion in Compressor) ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఈ దుర్ఘటన ఎలా జరిగిందనే దానిపై ఇంకా ఆరా తీస్తున్నారు. మృతులు ఒడిశా, బిహార్, యూపీ వాసులుగా గుర్తించారు. తీవ్ర గాయాలైనవారిని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా, గాంధీ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో ఇక్కడ ఇలాంటి ఘటన జరిగినప్పుడే కార్మికుల భద్రత దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని ఇచ్చిన సూచనల్ని ఏ మేరకు పాటించారనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సౌత్ గ్లాస్ పరిశ్రమను శంషాబాద్ డీసీపీ రాజేశ్ పరిశీలించారు.