Nalgonda January 02: నల్లగొండలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన వారం రోజులకే వికారాబాద్ వన్ టౌన్ ఎస్‌ఐ రోడ్డు (Sub-inspector) ప్రమాదంలో మృతి చెందారు. ఈఘటనలో ఎస్‌ఐ(Sub-inspector)తో పాటు ఆయన తండ్రి కూడా మృతి చెందడంతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
రంగారెడ్డి జిల్లా (Rangareddy district) మాడుగుల మండలం మాన్యానాయక్ తండాకు చెందిన శ్రీను నాయక్ (30) (Nenavath Srinu Naik) వికారాబాద్ వన్ టౌన్ ఎస్‌ఐ (Sub-inspector in Vikarabad town police station)గా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీనుకు గత నెల 26న వివాహం జరిగింది. ఈ క్రమంలో ఒడిబియ్యం కార్యక్రమం ఉండడంతో తన తండ్రి మాన్యానాయక్ (55ను తీసుకొని హైదరాబాద్ నుంచి స్వగ్రామం మాడుగుల మండలం మాన్యానాయక్ తండాకు వెళ్లారు.
అక్కడ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న అనంతరం తండ్రితో కలిసి హైదరాబాద్‌కు ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో చింతపల్లి మండలం పోలెపల్లి రాంనగర్(Polepally Ramnagar) గ్రామ పరిధిలోకి రాగానే హైదరాబాద్ నుంచి దేవరకొండ(Devarakonda) వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీను నాయక్, అతని తండ్రి ఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న చింతపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన చింతపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నారు