Kalvakuntla Kavitha | File Image

Hyd, Mar 15: ఢిల్లీ మద్యం కేసు(Delhi Liquor Case)లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha)సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఒక మహిళను విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడంపై ఆమె పిటిషన్‌ దాఖలు చేశారు. తమకు ఇచ్చిన నోటీసుల్లో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పారని.. కానీ అలా చేయలేదని కవిత పేర్కొన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని ఆమె కోరారు. తనకు ఇచ్చిన నోటీసులో ఇతరులతో కలిపి విచారిస్తామన్నారని, కానీ అలా చేయలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మొబైల్ సీజ్ చేశారని తెలిపారు. సీఆర్‌పీసీ 160 సెక్షన్‌ ప్రకారం మహిళను తన ఇంట్లోనే విచారించాలని, కానీ ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా షర్మిల ఆందోళన, అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు, కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులో అవకతవకలు ఆరోపణలు

అయితే మధ్యంతర రిలీఫ్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ పిటిషన్‌పై ఈనెల 24న విచారణ చేపడతామని చెప్పింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత గురువారం(మార్చి 16) మరోసారి ఈడీ ఎదుట హాజరుకానున్న విషయం తెలిసిందే. ఈనెల 11న ఈడీ అధికారులు ఆమెను 9 గంటలపాటు విచారించారు. 16న మళ్లీ విచారణకు హాజరుకావాలన్నారు. ఈనేపథ్యంలోనే ఆమె ఈడీ నోటీసులపై స్టే ఇవ్వాలని సుప్రీంను ఆశ్రయించగా.. నిరాశ ఎదురైంది.