Hyderabad, July 02: తెలంగాణలో (Telengana) కొలువుల జాతర (Jobs)కొనసాగుతూనే ఉంది. అన్ని శాఖల్లో ఖాళీగా (vacancies) ఉన్న పోస్టుల భర్తీకి ఓ వైపు ఆర్థిక శాఖ (Finance department) అనుమతిస్తుంటే.. మరో వైపు ఆయా శాఖలు నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నాయి. తాజాగా నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ (R&B)శాఖల్లోని 1,522 ఇంజినీరింగ్ పోస్టులు సహా 1663 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా అనుమతిచ్చిన వాటిలో నీటిపారుదలశాఖలో 704 ఏఈఈ పోస్టులు, 227 ఏఈ పోస్టులు, 212 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు, 95 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ అనుమతులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 46,998 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. మిగిలిన పోస్టుల భర్తీకి కూడా అనుమతుల ప్రక్రియను ఆర్థికశాఖ ముమ్మరం చేసింది. త్వరలోనే ఆ పోస్టుల భర్తీకి కూడా అనుమతులు ఇవ్వనున్నారు.
పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి...
నీటి పారుదల శాఖ
ఏఈఈ పోస్టులు – 704
ఏఈ పోస్టులు – 227
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు – 212
టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు – 95
ఆర్ అండ్ బీ శాఖ
సివిల్ ఏఈ పోస్టులు – 38
సివిల్ ఏఈఈ పోస్టులు – 145
ఎలక్ట్రికల్ ఏఈఈ పోస్టులు – 13
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు – 60
టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు – 27
భూగర్భ జలశాఖ
అసిస్టెంట్ కెమిస్ట్ – 4
అసిస్టెంట్ డ్రిల్లర్ – 4
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) – 12
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(మెకానికల్) – 3
అసిస్టెంట్ జియోఫిజిస్ట్ – 6
అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్ – 15
అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ – 5
అసిస్టెంట్ హైడ్రోమెట్రాలజిస్ట్ – 1
డ్రిల్లింగ్ సూపర్ వైజర్ – 4
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – 4
ల్యాబ్ అసిస్టెంట్ – 1
టెక్నికల్ అసిస్టెంట్(హైడ్రోజియాలజీ) – 7
టెక్నికల్ అసిస్టెంట్(హైడ్రాలజీ) – 5
టెక్నికల్ అసిస్టెంట్(జియోఫిజిస్ట్) – 8
ట్రెసర్(డిస్ట్రిక్ట్) – 8
ట్రెసర్(హెచ్‌వోడీ) – 1