CPR to 23 days old Infant (PIC @ Harish rao Twitter)

Hyderabad, April 11: ఇటీవల పెరిగిన పోయిన గుండెపోటు మరణాలతో సీపీఆర్‌పై (CPR) ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకుంటున్నారు. అకస్మాత్తుగా పడిపోయినవారికి సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని డాక్టర్లు తరచూ చెప్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపై విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే అదే సీపీఆర్ 23 రోజుల చిన్నారి ప్రాణాలను కాపాడింది. సిద్దిపేట (Siddipet)జిల్లాలో అరుదైన సంఘటన జరిగింది. స్నానం చేయించేటప్పుడు నీళ్లు మింగడంతో శ్వాస ఆగిపోయిన 23 రోజుల పసికందుకు సీపీఆర్‌ చేసి ప్రాణాలను కాపాడారు.

వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు (CPR) మండలం చద్లాపూర్‌లోని మెగా క్యాంప్‌ కార్యాలయంలో బిహార్‌కు చెందిన ప్రేమ్‌నాథ్‌ యాదవ్‌, కవిత దంపతులకు 23 రోజుల కిందట ఆడ శిశువు జన్మించింది. రోజు మాదిరిగానే ఆ పాపకు కవిత స్నానం చేయిస్తుండగా నీళ్లు మింగి శ్వాస ఆగిపోయింది. బిడ్డ చలనం లేకుండా ఉండటంతో వెంటనే ఏఎన్‌ఎం, ఆశావర్కర్‌కు కవిత సమాచారం అందించింది. వెంటనే వాళ్లు 108 నంబర్‌కి ఫోన్‌ చేశారు.

Hyderabad Rains: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం, ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు, వర్షం కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ 

హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకున్న 108 సిబ్బంది పాపను పరీక్షించారు. పాప గుండె, నాడి కొట్టుకోవడం లేదని గమనించిన సిబ్బంది వెంటనే సీపీఆర్‌ చేశారు. దీంతో పాప స్పృహలోకి వచ్చింది. వైద్యుల సూచన మేరకు పాపను సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమయానికి స్పందించి పాప ప్రాణాలు కాపాడినందుకు 108 సిబ్బందికి కుటుంబసభ్యులు, బంధువులు ధన్యవాదాలు తెలిపారు.