Heavy Rains (Photo-ANI)

ఒక పక్కన ఎండాకాలం అని ఎండలు మండిపోతున్నాయి. మరో పక్కన సడెన్ గా తుఫానులంటూ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవలే తుఫానుతో మండే ఎండల్లో భీభత్సమైన వర్షాలు కురిశాయి. తాజాగా మరోసారి వర్షాలు పడుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్ లో ఎండ ఎక్కువగానే ఉంది. ఇక మధ్యాహ్నం ఎండ దంచి కొట్టింది. కానీ సాయంత్రానికి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.

హైదరాబాద్ లో ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులొచ్చాయి. మబ్బులతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మార్పులు చోటుచేసుకోవడంతో అక్కడక్కడా ఒక మోస్తారు వర్షం కురుస్తోంది.

ఎఫ్ఐఆర్‌లో కీలక విషయాలు, విద్యార్థులను రెచ్చగొట్టేలా ప్రసంగాలు, ముందస్తు చర్యగా అరెస్టు చేశామని తెలిపిన పోలీసులు, హైకోర్టులో రేపు విచారణకు పిటిషన్

నగరంలోని జీడిమెట్ల, బేగంపేట, అమీర్ పేట, షాపూర్ నగర్, సూరారం, కుత్బుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి, గచ్చిబౌలి, చంపాపేట్‌, కర్మన్‌ఘాట్‌, సరూర్‌నగర్‌, సైదాబాద్‌, అంబర్‌పేట్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అత్తాపూర్, రాజేంద్రనగర్, నార్సింగి, మణికొండ, పుప్పాలగూడ, కాటేదాన్, మెహదీపట్నం, చార్మినార్, జియాగూడ, లంగర్ హౌస్, కాలిమందిర్, సన్ సిటీ, బంజరాహిల్స్, గచ్చిబౌలి, ఉప్పల్, రామంతపూర్, హబ్సిగూడ, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో వాన పడుతోంది. వర్షం కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న చినుకులు పడ్డాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారింది.

ఏపీలో భారీ వర్షాలు

ఇక ఏపీలో మన్యంలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. పాడేరు మొదలుకుని ఏజెన్సీలోని జి.మాడుగుల నుంచి జీకేవీధి మండలం వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పాడేరులో ఉదయం నుంచి సాధారణ వాతావరణం ఏర్పడింది. మధ్యాహ్నం రెండు గంటల తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఆకాశం మేఘావృతమై భారీ వర్షం మొదలైంది.

చింతపల్లి మండలంలో భారీ వర్షం కురిసింది. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు కుండపోత వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులన్నీ వాగులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు, వాగులు వర్షపు నీటితో నిండాయి.

పాడేరు, పరిసర ప్రాంతాలతోపాటు జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా, ఇతర మండలాల్లో వాన జాడలేదు. వేసవి కాలంలో అనుకోని ఽవిధంగా భారీగా వర్షం కురవడం విశేషం.