Telangana Budget 2024: రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ..అర్హులకే రైతు బంధు.. ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం..తెలంగాణ బడ్జెట్ లో హైలైట్స్ ఇవే..
Deputy CM Bhatti Vikramarka (photo-Video Grab)

శనివారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో సమావేశమైన తెలంగాణ కేబినెట్ 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటింగ్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. అనంతరం ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క మధ్యాహ్నం బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టగా, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు శాసన మండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తొలి బడ్జెట్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. రాష్ట్ర బడ్జెట్  2,75,891 కోట్ల రూపాయలుగా తేలింది.  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ఆరు హామీల అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది.  వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా బడ్జెట్‌ అన్ని వర్గాలకు మేలు చేస్తుందని అధికార పక్షం చెబుతోంది.

తెలంగాణ బడ్జెట్ హైలైట్స్ ఇవే..

శాఖలవారీగా కేటాయింపులు ఇవే : పరిశ్రమల శాఖకు రూ. 2543 కోట్లు, ఐటీ శాఖకు రూ.774 కోట్లు. పంచాయతీ రాజ్ శాఖకు రూ.40,080 కోట్లు, పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు.. మూసీ రివర్ ఫ్రాంట్ కు వెయ్యి కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్లు, ఎస్సీ, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం రూ.1250 కోట్లు, ఎస్సీ సంక్షేమం రూ. 21,874 కోట్లు, ఎస్టీ సంక్షేమం రూ.13,013, రూ. మైనార్టీ సంక్షేమం రూ.2262 కోట్లు

>> బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ.1546 కోట్లు. బీసీ సంక్షేమం రూ8 వేల కోట్లు, విద్యా రంగానికి రూ.21,389 కోట్లు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ.500 కోట్లు. యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు, వైద్య రంగానికి రూ.11,500 కోట్లు, విద్యుత్ - గృహ జ్యోతికి రూ.2,418కోట్లు. విద్యుత్ సంస్థలకు రూ.16,825 కోట్లు.. గృహ నిర్మాణానికి రూ.7,740 కోట్లు. నీటి పారుదల శాఖకు రూ.28,024 కోట్లు

బడ్జెట్ విలువ ఎంత: 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2,75,891 కోట్ల రూపాయలు.. ఆరు గ్యారెంటీల కోసం రూ.53,196 కోట్లు అంచనా

అర్హులకే రైతు బంధు ఇస్తాం:  రైతు బంధు నిబంధనలు పునఃసమీక్ష చేస్తాం.. ఎకరాకు రూ. 15 వేలు ఇవ్వబోతున్నాం.. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తాం.. రైతుబంధుతో పెట్టుబడిదారులు, అనర్హులు లాభపడ్డారు.. రియల్ ఎస్టేట్ కంపెనీలు కొన్న భూములకు సైతం రైతు బంధు ఇచ్చారు

ధరణి మొత్తం మారుస్తాం:  మరికొంత మందికి ఆభరణంగా, చాలా మందికి భారంగా మారింది.. గత ప్రభుత్వ తప్పులతో ఎంతోమంది సొంత భూమిని కూడా అమ్ముకోలేక పోయారు.. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు సత్వర చర్యలు తీసుకున్నాం.. ధరణి పోర్టల్ పై అధ్యయనం చేయడానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశాం.

తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తాం: రాచరిక ఆనవాళ్లతో ఉన్న రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తాం.. రాజ్యంగ స్పూర్తితో ప్రజాస్వామ్యం, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా కొత్త చిహ్నం.. వాహన రిజిస్ట్రేషన్ కోడ్‌ను టీఎస్ నుంచి టీజీగా మార్పు చేశాం.. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తాం.. తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయాలన్నది మా లక్ష్యం.

ఇందిరమ్మ ఇళ్లకు రూ.5 లక్షల సాయం: ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం.. అధికారంలోకి వచ్చిన వెంటనే 6,956 నర్సింగ్ ఆఫీసర్లను నియమించాం.. త్వరలోనే ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణాన్ని ప్రారంభిస్తాం.

> మెగా డీఎస్సీ వేయబోతున్నాం.. 15000 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు నియామక పత్రాలు అందజేయబోతున్నాం.. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైన గ్రూప్ 1 లో 64 అదనపు పోస్టులు జత చేశాం.

>> రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ను అందించడానికి కట్టుబడి ఉన్నాం.. గృహజ్యోతి పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్.. కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టులు నిర్మించే విధానం రాష్ట్రానికి శాపంగా మారింది.. రూ. లక్షల కోట్ల ఖర్చుతో అవినీతి ఎంతో తేల్చాల్సి ఉంది.. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచాణ జరిపిస్తాం-