Hyderabad, May 20: తెలంగాణ మంత్రిమండలి సమావేశం (TG Cabinet Meeting Today) నేడు జరుగనున్నది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. మంత్రి మండలి సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం జరుగనున్నది. ఈసీ షరతుల కారణంగా ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణ, జూన్ నుంచి విద్యా సంస్థలు తెరిచేందుకు ప్రణాళిక వంటి అంశాలకే కేబినెట్ పరిమితం కానున్నట్టు తెలుస్తున్నది.
హెలికాప్టర్ కూలిన ఘటన.. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం.. ఇరాన్ అధికారిక మీడియా వెల్లడి
ఈసీ ఆంక్షలు.. నేడే తెలంగాణ కేబినెట్ భేటీhttps://t.co/zRHt03eNVz
— Newsmeter Telugu (@NewsmeterTelugu) May 20, 2024
ఈసీ షరతులు ఇవే..
- జూన్ 4లోపు (లోక్ సభ ఫలితాలు వెలువడే రోజు) చేయాల్సిన అత్యవసర విషయాలపైనే భేటీలో చర్చించాలి.
- హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రైతు రుణ మాఫీ అంశాలను ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాయిదా వేయాలి.
- ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు ఎవరిని కేబినెట్ సమావేశానికి పిలువొద్దు.