CM KCR Press Meet: కేంద్రం ధాన్యం సేకరించే వరకు పోరాటం సాగిస్తాం, ఆహార ధాన్యాల సేక‌ర‌ణ విష‌యంలో దేశ‌మంతా ఒకే పాల‌సీ ఉండాలని డిమాండ్ చేసిన సీఎం కేసీఆర్
CM KCR Fire (photo-Twitter)

Hyd, Mar 21: తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశం ముగిసిన అనంత‌రం కేసీఆర్ మీడియాతో (CM KCR Press Meet) మాట్లాడారు. ధాన్యం సేకరించే వరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (CM KCR) ప్రకటించారు. ధాన్యం సేకరణ (Grain collection) విషయంపై కేంద్రంతో చర్చించేందుకు రేపు మంత్రుల బృందం, ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆహారశాఖ మంత్రిని కలిసి, మెమోరాండం అందజేస్తారన్నారు. వాళ్లు సమ్మతిస్తే సంతోషం.. సమ్మతించని పక్షంలో ఎంతని పోరాటానికైనా సిద్ధం కావాలని సమావేశం నిర్ణయించిందని పేర్కొన్నారు.

ఈ పోరాటం ఆషామాషీగా ఉండదు. మాటలు, పేపర్‌ స్టేట్‌మెంట్లుగా ఉండదు.. యాక్షన్‌ ఓరియెంటెడ్‌గా ఉంటది. చాలా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యయుతంగా టీఆర్‌ఎస్‌ పార్టీకి, తెలంగాణ ప్రజలకు వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణ ఉద్యమ స్థాయి ఎంత ఉధృతంగా ఉండెనో.. అంత ఉధృతంగా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా కేంద్రం అల్టిమెట్‌గా తీసుకునే వరకు విశ్రమించే ప్రశ్న ఉత్పన్నం కాదు. ఇందులో భాగంగా మంత్రులు, ఎంపీలు రేపు విజ్ఞప్తు చేయబోతున్నరో.. అదే పద్ధతిలో తెలంగాణలోని యావత్‌ గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌, జడ్పీలు, మున్సిపల్‌, ఇతర సంస్థలు, మార్కెట్‌ కమిటీల్లో తీర్మానం చేసి ప్రధానికి పంపిస్తాం. అప్పటికే తీసుకుంటారని భావిస్తున్నాం. అలా కానీ పక్షంలో వందకు వందశాతం ఉద్యమిస్తామని సీఎం తెలిపారు.

క‌శ్మీర్ ఫైల్స్ సినిమాపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హం, ఈ ర‌క‌మైనటువంటి దేశ విభ‌జ‌న, ప్ర‌జ‌ల విభ‌జ‌న స‌రికాదని మండిపాటు

గతంలో పంజాబ్‌ రైతులను ఏడిపించిన అనేక కేంద్ర ప్రభుత్వాలు.. చాలా పోరాటాల తర్వాత వందశాతం ప్రొక్యూర్‌మెంట్‌ ఆర్డర్‌ వచ్చింది. ఇక్కడ సమాంతరంగా పంజాబ్‌ మాదిరిగా వందశాతం ప్రొక్యూర్‌మెంట్‌ ఆర్డర్‌ వచ్చే వరకు పోరాటం చేస్తాం. దాన్ని వదిలే ప్రశ్నే లేదు’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఆహార ధాన్యాల సేక‌ర‌ణ‌లో దేశ‌మంతా ఒకే పాల‌సీ ఉండాల‌ని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పండిన పండ‌బోయే యాసంగి వ‌రి ధాన్యాన్ని పంజాబ్ త‌ర‌హాలో కేంద్రంలో కొనుగోలు చేయాల‌ని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఏక‌గ్రీవంగా తీర్మానించాం. రేపు మంత్రుల బృందం, ఎంపీలు పార్ల‌మెంట్‌కు వెళ్లి, ఆహార మంత్రిని తెలంగాణ రైతుల ప‌క్షాన క‌లుస్తారు. కేంద్రం సూచ‌న మేర‌కు, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి సూచ‌న మేర‌కు రైతులు పంట‌ల మార్పిడి చేశారు.

ముగ్గురు కన్నకూతుళ్లపై తండ్రి అత్యాచారయత్నం, హైదరాబాద్ లో కలకలం, భార్యను ఇంటి నుంచి తన్ని తరిమేసి, కూతుళ్లతో కోరిక తీర్చుకునేందుకు ప్రయత్నం...

గ‌తంలో 55 ల‌క్ష‌ల ఎక‌రాల్లో వ‌రి పంట ఉండే. ఈ సారి 35 ల‌క్ష‌ల ఎక‌రాల్లో ఉంద‌న్నారు. దీంట్లో 3 ల‌క్ష‌ల ఎక‌రాల్లో సీడ్ కోసం వ‌రిని ఉత్ప‌త్తి చేశారు. మ‌రొక రెండున్న‌ర ల‌క్ష‌ల ఎక‌రాల్లో తిన‌డానికి వాడుకుంటారు. 30 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పండించిన వ‌రి అమ్మాల్సి ఉంటుంది. పంట మార్పిడి కింద వ‌రి ఉత్ప‌త్తిని త‌గ్గించగ‌లిగామ‌ని కేసీఆర్ తెలిపారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆహార రంగంలో అన్ని దేశాలు కూడా స్వాలంబ‌న ఉండాల‌ని కోరుకుంటాయి. భార‌త‌దేశంలో కూడా ఫుడ్ సెక్టార్ ముఖ్య‌మైంది కాబ‌ట్టి.. ప్ర‌పంచ జ‌నాభాలో భార‌త్ రెండో స్థానంలో ఉంది. ఈ క్ర‌మంలో దేశంలో ఆహార కొర‌త రాకుండా ఉండేందుకు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తెచ్చారు. ఈ క్ర‌మంలో కేంద్రం ధాన్యం సేక‌రించి, నిల్వ చేయాలి. కొన్ని సంద‌ర్భాల్లో ఒక వేళ ఎక్కువ పంట మొత్తంలో వ‌స్తే.. కేంద్ర‌మే భ‌రించి సేక‌రించాలి. ఆ బాధ్య‌త నుంచి కేంద్రం త‌ప్పించుకోకూడ‌దు. కేంద్రాన్ని స్ప‌ష్టంగా డిమాండ్ చేస్తున్నాం.

వ‌న్ నేష‌న్ వ‌న్ రేష‌న్ మాదిరిగానే వ‌న్ నేష‌న్ వ‌న్ ప్రొక్యూర్‌మెంట్ ఉండాలి. ఆహార ధాన్యాల సేక‌ర‌ణ విష‌యంలో దేశ‌మంతా ఒకే పాల‌సీ ఉండాలి. పంజాబ్‌కు ఒక నీతి, గుజ‌రాత్‌కు ఒక నీతి, తెలంగాణ‌కు ఒక నీతి ఉండ‌దు. ఇది రైతుల యొక్క జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌.. ఆ పంట సేక‌రించే విష‌యంలో ఇబ్బంది పెట్టొద్దు. కొన్ని రాష్ట్రాలు ఉద్య‌మించాయి కాబ‌ట్టి.. 100 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేశాయ‌ని కేసీఆర్ గుర్తు చేశారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా యాసంగి కాలంలో వ‌చ్చే వ‌రి ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాం. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర నిర్ణ‌యించేంది బియ్యానికి కాదు.. వ‌రి ధాన్యానికి. ఎంఎస్పీ ప్ర‌కార‌మే పంజాబ్లో సేక‌రిస్తున్నారు. అదే ప‌ద్ధ‌తిలో మా వ‌డ్ల‌ను కూడా కొనాల‌ని కేసీఆర్ డిమాండ్ చేశారు.