CM KCR (Photo-Video Grab)

బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) నేడు మహారాష్ట్రలో (Maharashtra) పర్యటించనున్నారు.ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మరఠ్వాడకు బయలుదేరుతారు. 11.15 గంటలకు కొల్హాపూర్‌ (Kolhapur) విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం కొల్హాపూర్‌లోని అంబాబాయి (మహాలక్ష్మి) ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.

మధ్యాహ్నం 12.45 గంటలకు సాంగ్లీ (Sangli) జిల్లాలోని వాటేగావ్‌ చేరుకుంటారు. మహారాష్ట్ర యుగకవిగా, దళిత సాహిత్య చరిత్రలో ఆద్యుడిగా పేరొందిన అన్నాభావు సాఠే (Annabhau sathe) 103వ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఆయన విగ్రహానికి నివాళులర్పిస్తారు. అనంతరం అన్నభావు బంధువుల ఇంటికి వెళ్లనున్నారు. అక్కడ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

తెలంగాణలో అత్యవసర సేవలకు 466 ఎమర్జెన్సీ వాహనాలు, నేడు జెండా ఊపి ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

ఆ తర్వాత ఇస్లాపూర్‌లోని రఘునాథ్‌ దాదాపాటిల్‌ నివాసానికి చేరుకుంటారు. కొల్హాపూర్‌లోని సాధు మహారాజ్‌ సమాధి వద్ద నివాళి అర్పిస్తారు. నాగాల పార్క్‌లోని పూధరి న్యూస్‌పేపర్‌ యజమాని ఇంటికి వెళ్తారు. సాయంత్రం 5.40 గంటలకు కొల్హాపూర్‌ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.