Power Tariff Hike in Telangana: తెలంగాణ ప్రజలకు విద్యుత్ షాక్, ఛార్జీల పెంపునకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త చార్జీలు, గృహ విద్యుత్ పై 40 నుంచి 50 పైసలు పెంపు

Hyderabad, March 23: తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల పెంపు (power tariff hike ) ఖరారైంది. 14 శాతం విద్యుత్‌ ఛార్జీలను పెంచేందుకు టీఎస్‌ ఈఆర్సీ Electricity Regulatory Commission గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం అధికారిక స్పష్టత వచ్చింది. పెరిగిన ఛార్జీల ప్రకారం.. డొమెస్టిక్‌ (Domestic) పై 40 నుంచి 50 పైసలు పెంపు వర్తించనుంది. ఇతర కేటగిరీలపై యూనిట్‌కు రూపాయి చొప్పున భారం పెరగనుంది. అయితే గతంలోనే పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు ఇచ్చిన డిస్కంలు.. 19 శాతం పెంపునకు అనుమతి కోరాయి. కానీ, ఈఆర్సీ మాత్రం 14 శాతానికే అనుమతి ఇచ్చింది. డిస్కమ్‌లకు (Discoms) 10వేల కోట్ల రూపాయల ద్రవ్యలోటు ఉన్నట్లు డిసెంబర్‌ నెలలోనే నివేదికలు సమర్పించకగా.. ఛార్జీలు పెంచకతప్పదనే సంకేతాలు ఆ టైంలోనే అందించాయి.

Secunderabad Fire Accident: బోయిగూడ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున నష్టపరిహారం

సుమారు ఏడేళ్ల తర్వాత విద్యుత్‌ ఛార్జీల (Power tariff hike ) పెంపు ప్రతిపాదనలు ఇవ్వగా.. సూత్రప్రాయంగా విద్యుత్‌ నియంత్రణ మండలి టీఎస్‌ ఈఆర్సీ అంగీకరించింది. డిస్కమ్‌లు ఐదేళ్ల విద్యుత్‌ టారిఫ్‌ ప్రతిపాదనలు కమిషన్‌ ముందుంచాయని, దీనిపై వినియోగదారుల అభిప్రాయాలను కమిషన్‌ పరిగణనలోకి తీసుకుందని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ERC) ఛైర్మన్‌ టి.శ్రీరంగారావు తెలిపారు.

Disha Patrol Vehicles: మహిళా రక్షణే మా ధ్యేయం, 163 దిశ పెట్రోలింగ్‌ వాహనాలు అందుబాటులోకి, మహిళలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదని తెలిపిన ఏపీ సీఎం జగన్

‘‘2022-23 ఏడాదికి డిస్కమ్‌లు ప్రతిపాదించిన రెవెన్యూ గ్యాప్‌ రూ.16వేల కోట్లు. కానీ, రూ.14,237 కోట్ల రెవెన్యూ గ్యాప్‌ను కమిషన్‌ ఆమోదించింది. రెవెన్యూ అవసరాలు రూ.53వేల కోట్లుగా ఏఆర్‌ఆర్‌ ప్రతిపాదన. ఏఆర్‌ఆర్‌ ప్రతిపాదనలకు కమిషన్‌ రూ.48,708 కోట్లు ఆమోదించింది. గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు, పరిశ్రమలకు యూనిట్‌పై రూపాయి పెంపు. పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి’’ అని ఈఆర్సీ ఛైర్మన్‌ తెలిపారు.