TSPSC notifies 1,392 junior lecturer posts

Hyderabad, JAN 27: తెలంగాణలోని నిరుద్యోగులకు మరో శుభవార్త అందించింది ప్రభుత్వం (Telangana government). ఇప్పటికే వివిధ జాబ్ నోటిఫికేషన్లు (Job Notifications) విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా మరికొన్ని ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని 2,391 పోస్టుల భర్తీకి తెలంగాణ ఆర్థిక శాఖ అనుమతించింది. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా ఇందుకు సంబంధించిన వివరాల్ని పోస్ట్ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ(TSPSC), మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB), తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్ట్యిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TREIB) ద్వారా ఈ ఉద్యోగాలు భర్తీ కానున్నట్లు హరీష్ రావు వెల్లడించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల్ని సీఎం కేసీఆర్ నిలబెట్టుకుంటున్నట్లు హరీష్ రావు తెలిపారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 10 ప్రిన్సిపల్ పోస్టులు, 480 డిగ్రీ లెక్చ‌ర‌ర్ పోస్టులు, 185 జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ పోస్టులు, 235 పీజీటీ పోస్టులు, 324 టీజీటీ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది ప్రభుత్వం. అలాగే తెలంగాణ స‌మాచార పౌర సంబంధాల శాఖ‌లో మరో 166 పోస్టులు భ‌ర్తీ కానున్నాయి. ఇప్పటికే తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ విభాగంలోని పలు పోస్టులతోపాటు ఇంటర్, సాంకేతిక విద్యలో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదలైంది.