Telangana Govt Logo

Hyderabad, March 09: తెలంగాణ ప్రభుత్వం మహిళలకు మరో గుడ్ న్యూస్ (Good News) చెప్పింది. మరో కొత్త స్కీమ్ ప్రారంభించనుంది. దీనిపై డిప్యూటీ సీఎం మల్లు భటి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఈ నెల 12న మహిళలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని (Indira Kranthi Scheme) ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Batti Vikramarka) తెలిపారు. దీని ద్వారా సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి మహిళా సంఘాలకు అవకాశం లభిస్తుందన్నారాయన. రాష్ట్రంలోని ప్రతి మహిళను మహాలక్ష్మిగా భావించి గౌరవిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను నిర్వీర్యం చేసిందని ఆయన ఆరోపించారు.

Good News for TSRTC Employees: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త.. 21 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటన.. 2017 పీఆర్సీని పూర్తిస్థాయిలో ఇవ్వాలని నిర్ణయం 

రైతుబంధు సాయం (Raithu Bandhu)పైనా భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయం చేసే వారికే రైతుబంధు ఇస్తామని తేల్చి చెప్పారాయన. కొండలు, గుట్టలు, రోడ్లకు రైతుబంధు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు డబ్బులను 5 నెలలు రైతుల ఖాతాల్లో వేసిందన్న భట్టి విక్రమార్క.. కాంగ్రెస్ సర్కార్ వారి కంటే తక్కువ సమయంలోనే రైతు బంధు సాయాన్ని అందజేస్తోందన్నారు. ప్రస్తుతం పాత డేటా ప్రకారమే రైతు బంధు ఇస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 4 ఎకరాల లోపు ఉన్న వారికి రైతుబంధు ఇస్తున్నామని, త్వరలో 5 ఎకరాల లోపు ఉన్న వారికి రైతుబంధు ఇస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో వ్యవసాయ పంపులకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదన్నారు భట్టి విక్రమార్క. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు ఎప్పుడూ మొదటి వారంలో జీతాలు అందలేదన్న భట్టి విక్రమార్క.. కాంగ్రెస్ సర్కార్ లో మాత్రం ఉద్యోగులు అందరికీ మార్చి 1నే జీతాలు ఇచ్చామన్నారు.