Hyderabad, June 18: తెలంగాణ (Telanagana)ప్రభుత్వం నిరుద్యోగులకు (UnEmployees) గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే రాష్ట్రంలో 45,325 ఉద్యోగాల భర్తీకి (Jobs) ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం విధితమే. తాజాగా రాష్ట్రంలో కొత్తగా మరో 10,105 ఉద్యోగాల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో గురుకులాల్లోనే 9,096 పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఉత్తర్వుల విషయాన్ని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు (Harish rao) తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఏయే శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో వివరాలతో సహా పోస్టు చేశారు. తాజాగా జారీ చేసిన ఉత్వర్వుల ప్రకారం.. గురుకులాల్లో 9,096 పోస్టులు ఉన్నాయి.
Issued orders for recruitment of 10,105 vacancies in different Govt depts today. Unlike some whose job announcements are all about Jumla, TRS govt under the leadership of #CMKCR has so far given notification for 45325 jobs. Will issue more job notifications soon. pic.twitter.com/Qpwh1Hw7XY
— Harish Rao Thanneeru (@trsharish) June 17, 2022
మైనార్టీ గురుకుల విద్యాలయ సంస్థలో 1,445 పోస్టులు, బీసీ గురుకులాల్లో 3,870, గిరిజన గురుకులాల్లో 1,514, ఎస్సీ గురుకులాల్లో 2,267 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులన్నింటినీ గురుకుల విద్యాలయాల నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు.
ఇక ఎస్సీ అభివృద్ధి శాఖలో 316, మహిళా శిశు సంక్షేమశాఖలో 251, బీసీ సంక్షేమ శాఖలో 157, గిరిజన సంక్షేమ శాఖలో 78, దివ్యాంగ శాఖలో 71, జువైనల్ వెల్ఫేర్ లో 66 పోస్టులు సహా ఇతర 995 ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో జిల్లా ఎంపిక కమిటీ ద్వారా మరో 14 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఇప్పటికే 45,325 ఉద్యోగాల భర్తీకి అనుమతిచ్చామని, త్వరలో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని హరీష్ రావు తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు.