Double Bedroom Houses

Hyderabad, July 20: రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ నగర పరిధిలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను (Double Bedrooms) అర్హులైన లబ్ధిదారులకు త్వరలోనే అందజేస్తామని పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు (KTR) తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పంపిణీ (Double Bedroom Houses) ప్రారంభిస్తామని, అక్టోబర్‌ మూడవ వారం వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రాజకీయ జోక్యం లేకుండా అత్యంత పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను కేటాయించాలని అధికారులను ఆదేశించారు.

TSRTC Tracking APP: ఇక ఆర్టీసీ బస్సు ఎక్కడుందో లైవ్ లొకేషన్ తెలుసుకోవచ్చు! 3800 బస్సులకు ట్రాకింగ్ సిస్టమ్ అమలు చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ 

జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించాలన్నది లక్ష్యం కాగా, ఇప్పటికే అందులో అత్యధిక భాగం ఇండ్ల నిర్మాణం పూర్తయిందని పేర్కొన్నారు. మిగిలిన చోట్ల నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయని వివరించారు. మంత్రి కేటీఆర్‌ (KTR) ఆదేశాల మేరకు నిర్మాణం పూర్తయిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను లబ్ధిదారులకు అందించేందుకు జీహెచ్‌ఎంసీ షెడ్యూల్‌ను సిద్ధం చేసింది. లబ్ధిదారుల ఎంపిక విషయంలో రెవెన్యూ యంత్రాంగం సహకారం తీసుకుంటున్నది. దాదాపు ఆరు దశల్లో నిర్మాణం పూర్తయిన సుమారు 65 వేలకుపైగా ఇండ్లను పేదలకు అందజేయనున్నారు. వీటితోపాటు తుది దశలో ఉన్న ఇండ్లను కూడా ఎప్పటికప్పుడు ఈ పంపిణీ కార్యక్రమానికి అదనంగా జత చేసే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.