Hyderabad, DEC 22: తెలంగాణలో కొత్తగా 12 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona Cases) తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,44,540కు చేరింది. తాజాగా ఒకరు కరోనా నుంచి కోలుకోగా కోలుకున్న వారి సంఖ్య మొత్తం 8,40,391కి పెరిగింది. ప్రస్తుతం 38 మంది చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ (TS Corona Bulliten) బులిటెన్‌లో పేర్కొంది. కొత్తగా 1,322 కొవిడ్ టెస్టులు చేసినట్లు పేర్కొంది.
30 మంది రిపోర్టులు రావాల్సి ఉందని చెప్పింది. రాష్ట్రంలో రికవరీ రేటు 99.51శాతంగా ఉందని, మరణాల రేటు 0.49శాతం ఉన్నట్లు వివరించింది.