Covid in Ts: తెలంగాణలో మరోసారి వేయి దాటిన కేసులు, గత 24 గంటల్లో 1,061 మందికి కరోనా,అత్యధికంగా హైదరాబాదులో 401 కొత్త కేసులు

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 43,318 కరోనా పరీక్షలు నిర్వహించగా... 1,061 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 401 కొత్త కేసులు నమోదయ్యాయి.

Covid in Ts: తెలంగాణలో మరోసారి వేయి దాటిన కేసులు, గత 24 గంటల్లో 1,061 మందికి కరోనా,అత్యధికంగా హైదరాబాదులో 401 కొత్త కేసులు
Coronavirus testing | File Image | (Photo Credits: PTI)

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 43,318 కరోనా పరీక్షలు నిర్వహించగా... 1,061 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 401 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 63, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 56, నల్గొండ జిల్లాలో 51, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 46, కరీంనగర్ జిల్లాలో 43 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 836 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 8,23,724 మంది కరోనా బారినపడగా, వారిలో 8,13,256 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,357 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

(The above story first appeared on LatestLY on Aug 05, 2022 11:07 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).