Telugu States CM’s Meeting: ముగిసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ, గంటా 45 నిమిషాల పాటూ సాగిన చర్చలో ప్రస్తావనకు వచ్చిన అంశాలివే!
హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో (Praja bhavan) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), రేవంత్ రెడ్డి (Revanth Reddy)సమావేశమై చర్చించారు. గంటా 45 నిమిషాల పాటు సమావేశం జరిగింది. మరోసారి సీఏస్‌ల స్థాయిలో సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారానికి రెండు కమిటీలు వేయాలని నిర్ణయించారు.
Hyderabad, July 06: హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో (Praja bhavan) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), రేవంత్ రెడ్డి (Revanth Reddy)సమావేశమై చర్చించారు. గంటా 45 నిమిషాల పాటు సమావేశం జరిగింది. మరోసారి సీఏస్‌ల స్థాయిలో సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారానికి రెండు కమిటీలు వేయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లోని ఆస్తులన్నీ తెలంగాణకే చెందుతాయని చంద్రబాబుకి రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది.
తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారితో హైదరాబాద్ లో నేడు ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ నారా చంద్రబాబునాయుడుగారు సమావేశమై విభజన సమస్యలపై కూలంకషంగా చర్చలు జరిపారు. ఇరు రాష్ట్రాలకు ఉభయతారకంగా ఈ చర్చలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. pic.twitter.com/1Rqc4lDg74
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 6, 2024
రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మరో ఇద్దరు అధికారులు ఇందులో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడితో పాటు మంత్రులు కందుల దుర్గేశ్, సత్య ప్రసాద్, బీసీ జనార్దన్ ఉన్నారు. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్, అధికారులు కార్తికేయ మిశ్రా, రవిచంద్ర ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించిన ప్రధాన అంశాలు:
- షెడ్యూల్డ్ 9, 10 లోని పెండింగ్ సమస్యల పరిష్కారం దిశగా చర్చలు
- పోలవరం ముంపుకు దూరంగా ఉన్న ఐదు గ్రామాలపై చర్చ
- కృష్ణా జలాలవివాదం చర్చ
- పోలవరం ముంపుకు దూరంగా ఉన్న ఐదు గ్రామాలపై చర్చ
- విద్యుత్తు సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చ
- విభజనకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టి
(The above story first appeared on LatestLY on Jul 06, 2024 08:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

