Temperature in Telangana (Credits: Twitter)

Hyderabad, FEB 28: తెలంగాణలో బుధవారం నుంచి ఉష్ణోగ్రతలు (Temperatures) పెరుగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD) మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగనున్నట్టు వెల్లడించింది. మార్చి రెండో వారం నుంచి ఉష్ణోగ్రతలు (Temperatures) మరింత పెరుగుతాయని పేర్కొన్నది. మరోవైపు తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమూ ఉన్నదని తెలిపింది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలు, రాత్రి 20 డిగ్రీలుగా నమోదైంది.

 

తెలంగాణలో గాలులు గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. పశ్చిమ తెలంగాణలో వేడి ఎక్కువగా ఉంటుందని, హైదరాబాద్‌లోనూ ఎండలు అధికంగానే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే ఐదురోజులపాటు రాయలసీమలో వేడి వాతావరణం ఉంటుందని తెలిపింది.