Medaram Jatara Ends Today: నేటితో ముగియనున్న మేడారం జాతర, అమ్మవార్ల వనప్రవేశంతో ముగియనున్న సంబరం, కోటి మంది భక్తులు హాజరు..
pic source: Twitter

ములుగు, ఫిబ్రవరి 19 : తెలంగాణ కుంభమేళా నేటితో ముగియనుంది. మేడారం జాతర నేడు అమ్మవార్ల వనప్రవేశంతో ముగియనుంది. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమయిన మేడారం జాతర నేటితో ముగియనుంది. నాలుగు రోజుల పాటు జరిగిన ఆ మహా జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అమ్మవార్లకు తమ మొక్కులు తీర్చుకున్నారు. జంపన్న వాగులో స్నానాలు చేసి అమ్మవార్లకు బంగారాన్ని సమర్పించుకుని కోరికలను కోరుకున్నారు. వన ప్రవేశంతో..... దాదాపు కోటి మందికి పైగానే భక్తులు మేడారం జాతరకు హాజరయి ఉంటారని అంచనా వేస్తున్నారు.

 వెనక్కి తగ్గిన రష్యా, ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల నుంచి బలగాలు ఉపసంహరణ, డ్రిల్స్ పూర్తి చేసుకున్న త‌ర్వాత దళాలు స‌రిహ‌ద్దు నుంచి వెన‌క్కి మ‌ళ్లాయని తెలిపిన రష్యా రక్షణ మంత్రి

వీఐపీలు కూడా ఎక్కువ మంది దర్శించుకున్నారు. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా చత్తీస్ ఘడ్, మహారాష్టర, మధ్యప్రదేశ్, ఒడిశా నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. నిన్న మేడారం జనసంద్రంగా మారింది. నేటితో మేడారం జాతర ముగియనుండటంతో ఈరోజు కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరు కానున్నారు. సాయంత్రం సమ్మక్క, సారలమ్మ వనప్రవేశంతో జాతర ముగియనుంది.