
మద్యం సేవించి భార్యను నానా హింసలు పెట్టడంతో,ఆ బాధలు భరించలేక కట్టుకున్న భార్య తన భర్తను కడతేర్చిన ఘటన శంషాబాద్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నానాజీపూర్ గ్రామంలో నివాసముంటున్న భార్యభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. రోజు మద్యం సేవించి వేధిస్తున్నాడని భర్త రాజు తనను చితక గొడుతున్నాడని నిందితురాలు వాపోయింది. అయితే అతడి బాధ భరించలేక నిందితురాలైన భార్య రాజును హత్యచేసింది. దీంతో శంషాబాద్ పోలీసులు నిందితురాలని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.